కేబీసీ లాటరీలో రూ.25 లక్షల ప్రైజ్ మనీ గెలుపొందారని... హైదరాబాద్ దూద్ బౌలి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కొన్ని రోజుల క్రితం ఫోన్ కాల్స్ వచ్చాయి. నగదును పొందేందుకు ఆధార్ కార్డు సమర్పించాలన్నారు. అనంతరం ప్రాసెసింగ్ ఫీజు, ఆదాయపు పన్ను, జీఎస్టీ ఛార్జీల పేరుతో విడతల వారీగా కొంత డబ్బును వారి అకౌంట్‌లోకి డిపాజిట్ చేయించుకున్నారు.
ప్రైజ్ మనీ పెరిగిందని..
అంతటితో ఆగకుండా మరోసారి ఆ మహిళకు ఫోన్ చేశారు. మీ ప్రైజ్ మనీ పెరిగిందని, రూ.కోటి విలువ చేసే కారు గెలుపొందారంటూ ఆశపెట్టారు. ముందు లానే విడతల వారీగా అడిగిన డబ్బులను వివిధ అకౌంట్‌లలో డిపాజిట్ చేసింది. ఇలా సుమారు రూ.4లక్షలు వారికి పంపించింది.