రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మండలం హకీంపేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. హకీంపేట నుంచి లగచర్లకు వస్తోన్న ఏపీ05టీసీ 0019 నెంబర్ గల లారీ... అదే మార్గంలో వస్తోన్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అక్కడికక్కడే ఒకరు మృతిచెందగా... మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు.
లారీ, ద్విచక్రవాహనం ఢీ... ఇద్దరు మృతి - Narayapet road accident news
నారాయణపేట జిల్లా హకీంపేట గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
లారీ, ద్విచక్రవాహనం ఢీ... ఇద్దరు మృతి
ప్రమాదానికి కారణం అతివేగమే అని పోలీసులు తెలిపారు. మృతులు లగచర్లకు చెందిన సురేశ్ గౌడ్, రమేశ్ గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:బల్దియా ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్ఠ బందోబస్తు