బ్రేకులు ఫెయిలవ్వడంతో.. జనాల మీదకు లారీ దూసుకు వచ్చిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో జరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఘోర ప్రమాదం తప్పింది. భారీలోడ్‌తో ఉన్న లారీ నర్సాపూర్ పట్టణం చేరుకోగానే బ్రేకులు పాడై జనాల మీదకు దూసుకు రావడంతో భయాందోళనలతో పరుగులు తీశారు.
బ్రేకులు ఫెయిలై .. బైక్‌ని ఢీ కొట్టి ..
డివైడర్‌పైకి ఎక్కించి లారిని నిలపలనే ప్రయత్నంలో భాగంగా ... అటుగా వెళ్తున్న భైక్‌ని ఢీ కొట్టి చాలా దూరం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో ద్వీచక్రవాహనదారుడు దాసు చెయ్యి నుజ్జునుజ్జయ్యింది. స్థానికులు బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 316 కరోనా కేసులు, రెండు మరణాలు