భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గొర్రెపెట వాగు వంతెన వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
మణుగూరు ఓసి గని నుంచి బొగ్గు లోడుతో ఓ లారీ భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి వెళుతుంది. విద్యుత్ కేంద్రంలోనే.. యూనిట్ 3,4 సీసీఎల్ పనుల జేబీసీఎల్ కంపెనీ చేపడుతోంది. కంపెనీ అవసరాల కోసం మణుగూరు నుంచి డీజిల్ డ్రమ్ములతో ట్రాక్టర్లో స్టోర్ ఇంఛార్జి కృష్ణారావు, డ్రైవర్ వెంకన్న బయలుదేరారు. గొర్రపేట వద్ద ట్రాక్టర్ను లారీ అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది.