రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ఎల్వర్తి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మహారాష్ట్రకు చెందిన సికిందర్ సింగ్, అలీఖాన్ పటాన్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి - రోడ్డు ప్రమాదం వార్తలు
ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన శంకర్ పల్లిలో చోటు చేసుకుంది. మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
![ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి lorry hits another parking lorry at shankarpally in rangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9999884-thumbnail-3x2-lorry.jpg)
ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న మరో లారీ.. ఇద్దరు మృతి