కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై హుజూరాబాద్ ప్రధాన కూడలి వద్ద లారీ బోల్తా పడింది. జన సంచారం, వాహనాలు లేనందున ప్రమాదం తప్పింది. ఈ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. మంగళవారం ఉదయం కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద అదుపుతప్పి పడిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.
జాతీయ రహదారిపై లారీ బోల్తా.. - హుజూరాబాద్‌లో లారీ బోల్తా
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అంబేడ్కర్ కూడలిలో లారీ బోల్తా పడింది. అదుపు తప్పి పడిపోయిన లారీని గమనించిన స్థానికులు డ్రైవర్, క్లీనర్‌ను బయటకు తీశారు. స్వల్ప గాయలైన క్లీనర్‌కు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

జాతీయ రహదారిపై లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్‌ను బయటకు తీశారు. స్వల్ప గాయాలైన లారీ క్లీనర్‌కు... స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న సీఐ మాధవి, ఎస్సై చీనానాయక్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. దారి మళ్లించి వాహనాలను పంపిస్తున్నారు.
జాతీయ రహదారిపై లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం
ఇదీ చూడండి:విష ప్రయోగం.. ఎనిమిది నెమళ్లు మృతి