తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

​వైరాలోని రోడ్డు పక్కన షెడ్డులో చిత్తూరు లారీ డ్రైవర్​ ఆత్మహత్య - khammam news

అతనిది ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా. చేసేది లారీ డ్రైవర్​ పని. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కర్రలోడుతో మహారాష్ట్రకు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఖమ్మం జిల్లా వైరాలో ఆగాడు. రోడ్డు పక్కనే ఉన్న రేకుల షెడ్డులో ఆత్మహత్య చేసుకున్నాడు.

lorry driver suicide in vyra
lorry driver suicide in vyra

By

Published : Aug 13, 2020, 4:01 AM IST

ఖమ్మం జిల్లా వైరాలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని మద్యం డిపో ఎదురుగా రహదారి పక్కన -ఉన్న రేకులషెడ్డులో ఓ లారీ డ్రైవర్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లాడ- దేవరకొండ జాతీయ రహదారిపై ప్రయాణం చేస్తున్న లారీని వైరాలో నిలిపి... బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... మృతదేహా వద్ద ఉన్న పత్రాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన షేక్‌ జాఫర్‌గా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కర్రలోడుతో మహారాష్ట్రకు వెళ్తూ.. వైరాలో ఆగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details