మద్యం మత్తులో నిర్లక్ష్యంగా లారీ నడిపి రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడి మృతికి కారణమైన లారీ డ్రైవర్, క్లీనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 20న రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి సాయిబాబానగర్ వద్ద మద్యం సేవించిన లారీ డ్రైవర్ మహ్మద్ షరీఫ్ వేగంగా వాహనం నడిపాడు. రాంగ్ రూట్లో లారీని నడుపుతూ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అజీజ్ షరీఫ్‌ను ఢీ కొట్టాడు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి - లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి
ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అతని అతివేగం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
ప్రమాదంలో అజీజ్‌వాహనంను లారీ 10 మీటర్ల వరకు ఈడ్చుకుపోయింది. బైక్‌ను ఢీ కొట్టి లారీని ఆపకుండా వేగంగా నడిపించడం వల్ల అజీజ్‌కు తీవ్రంగా గాయాలై మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ షరీఫ్‌తోపాటు క్లీనర్ మహ్మద్ అర్బాజ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి:అక్రమంగా తరలిస్తున్న 19 లక్షల విలువైన గుట్కా పట్టివేత