నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై అతివేగంతో దూసుకొచ్చిన ఓ లారీ.. ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
పాలకీడు మండలం శూన్యంపాడు గ్రామానికి చెందిన రమావత్ రవి, మంగ దంపతులు మిర్యాలగూడ మండలంలోని కిష్టాపురంలో బంధువుల ఇంట్లో పండగకు హాజరయ్యారు. తిరిగి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా.. బొత్తలపాలెం వద్ద లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి మరో బైకును ఢీకొంది. ఘటనలో మంగ, మరో బైకుపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. రవికి గాయాలయ్యాయి.