జగిత్యాల ధరూర్ వంతెన వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో కోరుట్లకు చెందిన లోకిని గంగాధర్, లోకిని రాజవ్వ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.
లారీ ఢీకొని దంపతులు మృతి - lorry auto accident
లారీ ఢీకొని దంపతులు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని దంపతులు మృతి
కోరుట్ల నుంచి ఉల్లిగడ్డలు అమ్ముకునేందుకు ఆటోలో మల్యాల వెళ్తుండగా.. కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. అనంతరం లారీని ఆపకుండా డ్రైవర్ పరారీ కావడం వల్ల పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా లారీ వివరాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ