ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో.. ఒకరు మృతి చెందారు. 29 మందికి తీవ్రగాయాలయ్యాయి. లారీ బోల్తా పడగా ప్రమాదం జరిగినట్లు.. క్షతగాత్రులు చెబుతున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన వీరంతా.. కూలి పని కోసం చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఉంటున్నారు.
లారీ బోల్తా.. ఒకరు మృతి.. 29 మందికి గాయాలు - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
ఏపీలోని నెల్లూరు శివారులోని జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 29 మంది రైల్వే కూలీలకు గాయాలయ్యాయి. బాధితులంతా తెలంగాణ వాసులుగా గుర్తించారు.
లారీ బోల్తా.. ఒకరు మృతి.. 29 మందికి గాయాలు
సంక్రాంతి పండుగ దృష్ట్యా.. సొంతూరికి వెళ్తుండగా ఘటన జరిగింది. గాయాలైనవారు ప్రస్తుతం నెల్లూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి:తండ్రి మరణాన్ని భరించలేక కూతురు ఆత్మహత్య.!