నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండా వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వైపు వెళ్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఘటనలో ఆగి ఉన్న లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ.. ఒకరి మృతి - lorry accident at indalwai
ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ.. ఒకరి మృతి
వలస కూలీలతో హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ వెళ్తున్న లారీ.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ మృతి చెందాడు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
TAGGED:
lorry accident at indalwai