ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు చేదు అనుభవం ఎదురైంది. బాపులపాడు మండలం మల్లవల్లిలో ఎమ్మెల్యేను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇళ్ల పట్టాలు పంపిణి చేయడానికిి వచ్చిన వంశీని వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు.. ఎమ్మెల్యే కార్యక్రమానికి రాకుండా అడ్డుకున్నారు.
గన్నవరం ఎమ్మెల్యే వంశీకి చేదు అనుభవం! - వల్లభనేని వంశీ వివాదాస్పద వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరకాకుండా.. మల్లవల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీకి వెళ్లిన ఆయనకు వ్యతిరేకంగా గో బ్యాక్ అంటూ.. నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
గన్నవరం ఎమ్మెల్యే వంశీకి చేదు అనుభవం!
ఈ ఘటనతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే వంశీ అనుకూల, వ్యతిరేక వర్గాల నినాదాలతో మల్లవల్లిలో ఉద్రిక్తత నెలకొంది.
ఇదీ చదవండి:సీమలో మళ్లీ అలజడి... తెదేపా నేత దారుణహత్య