కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని టెక్కే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 15 ఏళ్ల శ్రీహర్ష, శిల్పానగర్కు చెందిన రాజుగౌడ్ అనే యువకులు ద్విచక్రవాహనంపై వెళ్తూ.. గుంత వల్ల అదుపు తప్పి లారీ కిందకు దూసుకెళ్లారు. ఈ ఘటనలో శ్రీహర్ష ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
లైవ్ వీడియో: ఆర్ అండ్ బీ అధికారులు రాసిన మరణ శాసనం - kurnool accident latest news
పైప్లైన్ లీకేజీ అరికట్టేందుకు రోడ్డును తవ్వి వదిలేశారు ఆర్ అండ్ బీ అధికారులు. రోడ్డును మరమ్మతు చేయకుండా అలాగే వదిలేశారు. ఇదే ఆ యువకుల పాలిట శాపంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పడిన గుంత... ఓ యువకుడి నిండుప్రాణాన్ని బలి తీయగా.. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
accident
గుంత ఎందుకు ఏర్పడింది..?
ఈ ప్రాంతంలో ఆర్ అండ్ బీ రహదారి కింద నీటి పైప్లైన్ ఉంది. పైపు లీకవ్వడం వల్ల పురపాలక శాఖ సిబ్బంది మరమ్మతు చేశారు. అనంతరం తవ్విన రహదారిని అలాగే వదిలేశారు.