ఆదిలాబాద్ పట్టణంలో వరుస దొంగతనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పట్టణం నడిబొడ్డున ఉన్న ఓ దుకాణంలో దొంగలు చొరబడి రూ.8 లక్షలు విలువ చేసే.. సిగరెట్లు దొంగిలించారు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడం దొంగల బరితెగింపును కళ్లకు కట్టింది. పట్టణంలోని బి రాములు కాంప్లెక్స్‌లోని ఐఏ ట్రేడర్స్ షటర్‌ను ఓపెన్ చేసి.. లోపలికి ప్రవేశించిన దొంగలు.. దుకాణంలో సిగరెట్లను సంచుల మూటల్లో నింపి.. ప్రత్యేక వాహనంలో తరలించారు.
ఆదిలాబాద్‌లో వరుస చోరీలు.. భయాందోళనలో స్థానికులు - ఆదిలాబాద్ నేర వార్తలు
ఆదిలాబాద్ పట్టణంలో వరుస దొంగతనాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. పట్టణం నడిబొడ్డున ఉన్న ఓ దుకాణంలో దొంగలు చొరబడి.. రూ.8 లక్షల విలువ చేసే సిగరెట్లు అపహరించారు. రెండు రోజుల క్రితమే.. జాతీయ రహదారి పక్కనే ఉన్న చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి ఆభరణాలు దొంగిలించారు. వరుస చోరీల పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్‌లోనే రెండు రోజుల కిందట పట్టణ శివారులో జాతీయ రహదారికి అనుకుని ఉన్న చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి కిరీటం, ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన మరిచిపోక ముందే తాజాగా పట్టణ నడిబొడ్డునే మరో భారీ చోరీ జరగడం పట్టణ వాసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్ విసురు తున్నాయి. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడం చూస్తుంటే బయట నుంచి వచ్చిన ముఠాల పనేనని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.