సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గన్మాజోటి గ్రామానికి చెందిన శేఖర్(48) లైన్మెన్గా పని చేస్తున్నారు. బుధవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి జహీరాబాద్లోని శాంతి నగర్ కాలనీలో సెల్ఫోన్ టవర్లో విద్యుత్ సమస్య ఏర్పడింది.
విద్యుదాఘాతంతో లైన్మెన్ మృతి - latest crime news in sangareddy
విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో లైన్మెన్ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జరిగింది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు.
విద్యుదాఘాతంతో లైన్మెన్ మృతి
అక్కడికి వెళ్లిన లైన్మెన్ శేఖర్ మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరిగి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. విధినిర్వహణలో మృతి చెందిన శేఖర్ కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:మద్యానికి బానిసైన వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య