సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామంలో గత రెండురోజుల నుంచి కురుస్తోన్న వర్షాలకు ఓ ఇంటిపై పిడుగు పడింది. దీనితో ఇంటిపైన ఉన్న రేకులు పగిలిపోయాయి. పక్కన ఉన్న రెండు గేదెలు మృతి చెందాయి. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.
ఇంటిపై పిడుగు... సమీపంలోని రెండు గేదెలు మృతి - గుండ్లపల్లిలోని ఓ ఇంటిపై పిడుగు
గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటిపై పిడుగు పడింది. ఆ సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణపాయం తప్పింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

ఇంటిపై పిడుగు... సమీపంలోని రెండు గేదెలు మృతి
పక్కన ఉన్న రెండు గేదెలు మృతి చెందడం వల్ల వాటి యజమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి:పిడుగు పడి వ్యక్తి మృతి..స్పృహ కోల్పోయిన 12 మంది రైతులు