కన్నతల్లిని కడతేర్చిన కేసులో దోషికి జీవితఖైదు విధిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ కాలనీలో 2019 జనవరి 24 మహిళ దారుణ హత్యకు గురైంది. కేసునమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. కన్నకొడుకే హతమార్చినట్లు గుర్తించారు. బండరాయితో మోదీ అంతమొందించినట్లు తేల్చారు. ఖర్చులకు డబ్బులివ్వలేదనే ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు.
కన్నతల్లిని హతమార్చిన కేసులో జీవిత ఖైదు విధింపు - తెలంగాణ నేరవార్తలు
కన్నతల్లిని బండరాయితో మోదీ హతమార్చిన ఘటనలో దోషికి జీవిత ఖైదు విధించింది నాగర్‌కర్నూల్ కోర్టు. డబ్బులివ్వలేదనే కడతేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది.
కన్నతల్లిని హతమార్చిన కేసులో జీవిత ఖైదు విధింపు
సాక్ష్యాలతో రుజువు కావడం వల్ల తలకొండపల్లి వెంకటేష్‌కు జీవితఖైదు సహా, రెండు వేల జరిమానా విధిస్తూ నాలుగో అదనపు జిల్లా జడ్జి రవికుమార్ తీర్పు ఇచ్చారు.