తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రూ.30 కోసం బావ హత్య.. హంతకుడికి జీవితఖైదు - telangana crime news 2021

రూ.30 కోసం బావను హత్య చేసిన వ్యక్తికి ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగ్జీవన్ కుమార్ జీవిత ఖైదుతోపాటు వేయి రూపాయల జరిమానా విధించారు.

life sentence for the Accused in brother in law's murder case
రూ.30 కోసం బావ హత్య

By

Published : Jan 12, 2021, 10:36 AM IST

మహారాష్ట్రకు చెందిన డాకే మనోహర్ ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామంలో 2015లో తనకు వరసకు బావ అయిన డాకే శ్యామ్​రావును హత్య చేశాడు. తనకు రావాల్సిన 30 రూపాయల కోసం నిలదీసి ఇవ్వనందుకు శ్యామ్​ను హతమార్చి పరారయ్యాడు.

ఈ ఘటనపై బేల పోలీస్ స్టేషన్​లో హత్య కేసు నమోదయింది. భౌతిక, సాంకేతిక సాక్ష్యాధారాలతో న్యాయస్థానంలో రుజువైంది. ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జగ్జీవన్ కుమార్ నిందితుడు మనోహర్​కు జీవిత ఖైదుతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు.

ఇదీ చూడండి :కారు అద్దాలు పగులగొట్టి చోరీ.. పోలీసుల దర్యాప్తు

ABOUT THE AUTHOR

...view details