తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఎర్రకుంట కర్మాగారంలోని 20మంది బాలకార్మికులకు విముక్తి - హైదరాబాద్ క్రైం న్యూస్

హైదరాబాద్ ఎర్రకుంటలోని గాజుల కర్మాగారంలో వెట్టి చాకిరీ చేస్తోన్న 20మంది బాల కార్మికులకు రాచకొండ పోలీస్ కమిషనర్ విముక్తి కలిగించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. పిల్లలకు సరైన భోజనం పెట్టకుండా పని చేయించుకుంటున్నారని అన్నారు.

liberation for child labor at glass industry errakunta in Hyderabad
ఎర్రకుంట కర్మాగారంలోని 20మంది బాలకార్మికులకు విముక్తి

By

Published : Oct 5, 2020, 8:00 PM IST

హైదరాబాద్ బాలాపూర్‌ పరిధి ఎర్రకుంటలోని గాజుల కర్మాగారంలో పనిచేస్తోన్న 20మంది బాలకార్మికులకు విముక్తి కలిగించినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌ తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిర్వాహకులను అరెస్టు చేశామన్నారు. గాజుల పరిశ్రమల్లో సోదాలు నిర్వహించగా బిహార్‌కు చెందిన బాలకార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు సీపీ చెప్పారు.

ఎర్రకుంట కర్మాగారంలోని 20మంది బాలకార్మికులకు విముక్తి

వెట్టి చాకిరీ...

బిహార్ నుంచి అక్రమంగా పిల్లలను తరలించి కనీసం సరైన భోజనం పెట్టకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని వెల్లడించారు. వారితో అర్ధరాత్రి వరకు పనిచేయిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. నిందితులు బిహార్​కు చెందినవారేనని తెలిపారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత పిల్లలను వారి స్వస్థలాలకు పంపిస్తామని సీపీ వివరించారు.

ఇదీ చదవండి:రేప్ కేసు పెట్టేందుకు 800 కి.మీ ప్రయాణం!

ABOUT THE AUTHOR

...view details