తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మోతెలో చిరుత గుర్తులు.. కాదు హైనా అంటున్న అటవీశాఖ.. - సిద్దిపేట జిల్లాలో చిరుత సంచారం తాజా వార్తలు

సిద్దిపేట జిల్లా మోతెలో చిరుత పులి సంచారం స్థానికంగా కలవరం రేపింది. గ్రామస్థుల సమాచారం మేరకు అటవీ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.

Leopard Wandering at Mothe in siddipet district
మోతెలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు

By

Published : Jun 19, 2020, 11:16 AM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. పంట పొలాల వద్ద చిరుతను చూసిన పలువురు రైతులు సర్పంచ్​ శ్రీనివాస్​కు విషయం చెప్పారు. వెంటనే సర్పంచ్​ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం వల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సతీశ్​ కుమార్, బీట్ ఆఫీసర్ కిశోర్​లు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. గుర్తులు హైనాకి చెందినవిగా ప్రాథమికంగా నిర్ధారించారు.

మోతెలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు

గ్రామంలో హైనాలు సంచరిస్తున్నాయని.. పులి లేదని అటవీ అధికారులు పేర్కొన్నారు. గ్రామస్థులు ఆందోళన చెందొద్దని సూచించారు. అనుమానిత జంతువులను గుర్తుపట్టడానికి ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఇదీచూడండి: బావిలో పడిన చిరుతపులి.. ఇలా బయటపడింది

ABOUT THE AUTHOR

...view details