కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట్లో మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. ఘటనలో ఓ మేక చనిపోయింది.
గ్రామానికి చెందిన గొల్ల పర్శయ్య ఆదివారం సాయంత్రం మేకలను మేత కోసం గ్రామ శివారులోని అడవిలోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో చిరుతపులి ఒక్కసారిగా మేకల మందపై దాడి చేసింది. ఒక మేకను చంపేసి.. మరో దానిని లాక్కెళ్తుండగా పర్శయ్య గమనించి చిరుతను తరిమాడు. అనంతరం ఊళ్లోకి వచ్చి స్థానికులకు విషయం తెలిపాడు.