కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలోని 3 దుకాణాలపై , నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో 6 దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. సరకుల పై ఉన్న ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరకు అమ్మకాలు జరపడంతోపాటు కంపెనీ అడ్రస్ తదితర వివరాలు సరిగ్గా లేకపోయినందున కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు మేడ్చల్ జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
దుకాణ సముదాయాలపై తూనికలు కొలతల శాఖ దాడులు - kukatpally updates
నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్న పలు దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
Medchal district latest news
వస్తువులపై కంపెనీ అడ్రస్, వ్యాలిడిటీ వివరాలు కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. అలాగే ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరకు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.