తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మంత్రి కేటీఆర్​ పేరు వాడుకుని మోసం చేయాలనుకుని...

సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇద్దరు యువకులు ఏకంగా మంత్రి పేరుతోనే అక్రమాలకు తెరలేపారు. నల్గొండ జిల్లా తిరుమలగిరికి చెందిన ఓ వ్యక్తి అదే గ్రామానికి చెందిన మహిళకు చెందిన భూమి వివాదంలో ఉన్నదంటూ బెదిరించి బేరసారాలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు.

మంత్రి కేటీఆర్​ పేరు వాడుకుని మోసం చేయాలనుకుని...
మంత్రి కేటీఆర్​ పేరు వాడుకుని మోసం చేయాలనుకుని...

By

Published : Dec 28, 2020, 4:38 AM IST

నల్గొండ జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన శాగం ఈశ్వరమ్మకు చలకుర్తి చివారులో 8.20 ఎకరాల భూమి ఉంది. ఆమెకు అదే గ్రామానికి చెందిన అనుముల సైదులు ఫోన్​ చేసి... ఈశ్వరమ్మకు చెందిన భూమిపై సెక్రటేరియట్​లో పలు ఫిర్యాదులు వచ్చాయని... ఆ భూమిని మంత్రి కేటీఆర్​ పేదలకు పంచి ఇచ్చేలా ఆదేశించారని మాయమాటలు చెప్పాడు. దానిని ప్రభుత్వపరం కాకుండా చూడాలంటే తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. ఆ భూమి విషయమై రోజుకు పలుమార్లు ఫోన్​ చేసేవాడు. ఉన్నతాధికారుతో మాట్లాడిస్తానని చెప్పి చలకుర్తికి చెందిన గౌతమ్ రెడ్డితో ఫోన్ కాన్ఫరెన్స్​పెట్టి డబ్బులు డిమాండ్​ చేసేవాడు.

ఈ వ్యవహారమై బాధితురాలు హైదరాబాద్​లో ఉన్న తన కుమారుడి దగ్గరకు వెళ్లి చెప్పింది. ఫోన్​ నంబర్ల ఆధారంగా ఆమె కుమారుడు ఎల్బీనగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు ఇస్తామని చెప్పి రమ్మని.. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:ఆ అనుమానంతోనే తల్లిని కడతేర్చాడా..?

ABOUT THE AUTHOR

...view details