రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ బాహ్య వలయ రహదారి సమీపంలో అక్రమంగా గుట్కాను తరలిస్తున్న వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి సుమారు 20 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గుట్కా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు - Rangareddy District Latest News
అక్రమంగా గుట్కా తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, బొలెరో వాహనం, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
గుట్కా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
గుట్టు చప్పుడు కాకుండా బొలెరో వాహనంలో వివిధ రకాల గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:మహిళ కోసం గొడవ.. చికిత్స పొందుతూ ఒకరు మృతి