ఏపీలోని కర్నూలు జిల్లా డోన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై భారీగా వెండి పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 686.5 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెండి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందటంతో డోన్, వెల్దుర్తి, కృష్ణగిరి పోలీసులు అమకతాడు టోల్ ప్లాజా వద్ద తనఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 686 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్. ఫక్కీరప్ప తెలిపారు. ఈ దాడుల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారును తనిఖీ చెయ్యగా వెండి బయటపడిందని ఎస్పీ వెల్లడించారు. సీటు కింద ప్రత్యేక క్యాబిన్లో వెండిని దాచారని తెలిపారు.
సీటు కింద దాచారు.. అడ్డంగా బుక్కయ్యారు.. - silver illegal transport at karnool latest news
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా డోన్ సమీపంలోని అమకతాడు టోల్ గేట్ వద్ద రూ. 4.35 కోట్ల విలువైన 686.5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఓ బాలుడు సహా 5 మందిని అరెస్టు చేశారు. ఛత్తీస్గడ్ రాష్ట్రం రాయపూర్ నుంచి తమిళనాడులోని సేలంకు కారులో తరలిస్తుండగా కాపుకాచి పోలీసులు వెండిని పట్టుకున్నారు.
silver caught
బాలుడు సహా ఐదుగురు అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు. చత్తీస్గడ్ రాష్ట్రం రాయపూర్ నుంచి తమిళనాడులోని సేలంకు కారులో అక్రమంగా వెండిని తరలిస్తుట్లు ఎస్పీ తెలిపారు. జీరో బిజినెస్లో భాగంగా.. వెండిని తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. సుమారు 4 కోట్ల 35 లక్షల రుపాయలు విలువ చేసే వెండి, కారును సీజ్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.