తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గ్రామకంఠం భూమిపై వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ - latest crime news in nagarkarnool

గ్రామ కంఠం భూ వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసిన ఘటన నాగర్ కర్నూల్​ జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామ శివారులో జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

land dispute convert fight in nagarkarnool district
రంగాపూర్​లో ఘర్షణకు దారి తీసిన భూ వివాదం

By

Published : Aug 26, 2020, 3:26 PM IST

నాగర్ కర్నూల్​ జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామ శివారులో మూడున్నర ఎకరాల గ్రామ కంఠం భూమి ఉంది. ఆ భూమిలో ప్రకృతి వనం నిర్మించాలని గ్రామ పంచాయతీ తీర్మానించింది. కొంత మంది ఆ భూమి తమదంటూ అక్కడే గుడిసెలు వేసే ప్రయత్నం చేశారు.

గ్రామ కంఠం భూమి ఎవరికి చెందడానికి వీల్లేదని, ఆ భూమి గ్రామానిదని మరో వర్గం గుడిసెలు వేయడాన్ని అడ్డుకుంది. ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చాకే పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఇదీ చూడండి:'కులవృత్తుల అభివృద్ధికి దోహదపడుతున్న ఏకైక రాష్ట్రం మనదే

ABOUT THE AUTHOR

...view details