తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చెరువులు కనపడటమే పాపం.. వ్యర్థాలతో నింపేస్తున్నారు! - చెరువుల్లో రసాయన వ్యర్థాలు

కెమికల్​ వ్యర్థాలు ప్రజలు, మూగజీవాల పట్ల యమపాశంగా తయారవుతున్నాయి. అక్రమార్కులు ఇష్టారీతిన ఖాళీ స్థలాలు, చెరువుల్లో రసాయన వ్యర్థాలను వదిలిపెడుతున్నారు. తద్వారా ప్రజలు అనారోగ్యం బారిన పడటమే గాక.. మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. మేడ్చల్​ జిల్లా శివార్లలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

chemical wastages, medchal, lakes in outskirts,
రసాయన వ్యర్థాలు, మేడ్చల్ జిల్లా చెరువులు, పారిశ్రామిక వాడలు

By

Published : Jan 11, 2021, 3:38 PM IST

అక్రమార్కులు ఇష్టారాజ్యంగా అడ్డదారులు తొక్కుతూ ప్రజలు, మూగ జీవాల పట్ల యమపాశంగా తయారవుతున్నారు. పట్టపగలే చెరువుల్లో, ఖాళీ స్థలాల్లో రసాయన వ్యర్థాలను వదిలిపెడుతున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ తండాకు సమీపాన ఉన్న చెరువులో.. సోమవారం ఉదయం ఓ లారీలో వ్యర్థాలను తీసుకువచ్చి.. గుట్టుచప్పుడు కాకుండా చెరువులో వేశారు. కాజీపల్లి పారిశ్రామిక వాడ నుంచి వచ్చే ఈ వ్యర్థాలను .. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఖాళీ స్థలం కనపడితే వాటితో నింపేస్తున్నారు.

స్థానికులు చెరువు దగ్గరకు వెళ్లి పరిశీలించగా.. వ్యర్థాలు నీటిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మూగ జీవాలు చెరువులోని నీటిని తాగితే చనిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details