హైదరాబాద్ మీర్పేట్ పీఎస్ పరిధిలోని ఇంద్రసేనా రెడ్డి నగర్లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ ప్రాంతానికి చెందిన కవిత(36) ఇంద్రసేనా రెడ్డి నగర్లో గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటోంది. ఆమె భర్త వెంకటనారాయణ గతంలో చనిపోగా... 13 ఏళ్ల కుమారుడితో కలిసి ఉంటోంది. రెండేళ్ల క్రితం శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. శ్రీకాంత్ రెడ్డి ఎలక్ట్రీషియన్ పనిచేస్తుండగా.. ఆమె కూలి పని చేస్తుంది.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - crime news
ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని మీర్పేట్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
వీరిద్దరిమధ్య గత కొన్ని రోజులుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం అనుమానాస్పద స్థితిలో కవిత మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా తరలించిన పోలీసులు శ్రీకాంత్ రెడ్డిని విచారిస్తున్నారు.
ఇవీ చూడండి: పరకాలలో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య