తనపై అత్యాచారం జరిగిందంటూ హైదరాబాద్ పంజాగుట్టలో నమోదైన కేసు దర్యాప్తును పోలీసు అధికారులు సీఐడీకి అప్పగించారు. నల్గొండ జిల్లాకు చెందిన మహిళ తనపై తొమ్మిదేళ్లుగా 139 సార్లు అత్యాచారం చేశారని పంజాగుట్ట ఠాణాలో చేసిన ఫిర్యాదు కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై పోలీసు ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడ్డారు.
139సార్లు అత్యాచారం.. సీఐడీ దర్యాప్తు - hyderabad news
తీవ్ర కలకలం రేపుతున్న మహిళ అత్యాచారం కేసును పోలీసులు సీఐడీకి అప్పగించారు. తొమ్మిదేళ్లుగా లైంగిక దాడి జరుగుతున్నప్పుడు సదరు బాధితురాలు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న అంశంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు.
![139సార్లు అత్యాచారం.. సీఐడీ దర్యాప్తు lady rape case hand over to cid in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8558374-188-8558374-1598403709053.jpg)
lady rape case hand over to cid in hyderabad
కేసును సీఐడీకి అప్పగించగా... అధికారులు రంగంలోకి దిగి ముమ్మర దర్యాప్తు చేయనున్నారు. తొమ్మిదేళ్లుగా లైంగిక దాడి జరుగుతున్నప్పటికీ... బాధిత మహిళ ఎందుకు ఇన్నాళ్లు ఫిర్యాదు చేయలేదు...? అనే అంశంపై సీఐడీ లోతుగా ఆరా తీయనుంది. ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్న విషయాల్లో వాస్తవాలపై దృష్టి సారించనుంది.