తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మాజీ ప్రియుడ్ని చంపి.. మరొకరితో వెళ్లిపోయింది! - news on muder cases at guntur

డబ్బు కోసం మాజీ ప్రియుడ్ని చంపి.. ఇంటి ఆవరణలో పాతి పెట్టిందో మహిళ. రూ.12 లక్షలు తీసుకొని తాజా ప్రియుడితో పరారైంది. ఈ ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో జరిగింది.

ఏపీ: మాజీ ప్రియుడ్ని చంపి.. మరొకరితో వెళ్లిపోయింది!
ఏపీ: మాజీ ప్రియుడ్ని చంపి.. మరొకరితో వెళ్లిపోయింది!

By

Published : Aug 18, 2020, 5:39 PM IST

Updated : Aug 18, 2020, 9:22 PM IST

మాజీ ప్రియుడిని మరో ప్రియుడితో కలిసి హతమార్చిన మహిళ.. ఇంటి ఆవరణలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టి.. రూ.12 లక్షలతో పరారైన దారుణ ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చెరుకుపల్లికి చెందిన ఆర్​ఎంపీ వైద్యుడు బల్లేపల్లి చిరంజీవి ఎనిమిదేళ్ల క్రితం మనస్పర్థల కారణంగా భార్యతో విడిపోయాడు. అనంతరం శిరీష అనే యువతితో కొన్నేళ్లు సహజీవనం చేశాడు.

ఈ క్రమంలో 2 నెలలుగా చిరంజీవి కనిపించడం లేదని కుటుంబీకులు ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. పూర్తి వివరాలు ఆరా తీసిన అనంతరం ప్రాథమిక విచారణలో చిరంజీవిది హత్యగా నిర్ధరించారు. లోతుగా దర్యాప్తు చేసి ప్రియురాలే హత్య చేసి ఇంటి ఆవరణలో పాతి పెట్టినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు తవ్వి బయటికి తీయించారు.

మరో ప్రియుడితో కలిసి

శిరీష తన మరో ప్రియుడు భాను ప్రకాష్​తో కలిసి చిరంజీవిని దారుణంగా హతమార్చినట్లు ఎస్పీ విశాల్​ గున్నీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇటీవల చిరంజీవికి చెందిన ఓ ఆస్తిని మూడు నెలల క్రితం విక్రయించగా.. రూ.18 లక్షలు వచ్చాయని అన్నారు. ఈ క్రమంలో చిరంజీవిని శిరీష ప్రియుడితో కలిసి హతమార్చి.. రూ.12 లక్షలతో పరారైనట్లు వివరించారు. మే 6న చిరంజీవి హత్య జరిగిందని .. మంగళవారం మృతదేహం ఆనవాళ్లు వెలికితీశామని ఎస్పీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

మూడున్నర కోట్ల వివాదం.. ముగ్గురి ప్రాణం..

Last Updated : Aug 18, 2020, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details