మరుగుదొడ్డిలో మహిళకు ప్రసవం.. శిశువు మృతి - మహిళకు ప్రసవం వార్తలు
09:53 December 23
.. శిశువు మృతి
వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రసవం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు లేరంటూ సిబ్బంది ఆలస్యం చేయడంతో... ఆమె మరుగుదొడ్డిలోనే జన్మనిచ్చింది. శిశువు మృతి చెందడంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఆలస్యం చేశారని ఆరోపణ చేశారు.
ఎవరూ రాలేదు నా వద్దకు..
మల్రెడ్డిపల్లికి చెందిన మనీషా పురిటి నొప్పులతో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జిల్లా ఆస్పత్రికి వచ్చామని తెలిపింది. అప్పటికే పురిటి నొప్పులు మొదలయ్యాయని... వైద్యులు లేరని సిబ్బంది చెప్పారని వెల్లడించింది. అనంతరం కాలకృత్యాలు తీసుకునేందుకు వెళ్లేసరికి ప్రసవం అయిందని... 15 నిముషాలు అయినా సిబ్బంది తన వద్దకు రాలేదని వాపోయింది.
వెంటనే అక్కడికి వెళ్లాము..
మరుగుదొడ్డిలో కాన్పు కావడంతో అక్కడి నుంచి ఆమె కేకలు వేసింది. వెంటనే వైద్యసిబ్బంది పరుగున వెళ్లి తల్లీ,బిడ్డను బయటకు తీసుకువచ్చామని సిబ్బంది తెలిపారు. బిడ్డకు సపర్యలు చేసి.. శిశు వైద్య పరీక్షలు చేయించామని... అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని వెల్లడించారు. సమాచారం అందుకున్న ఎస్సై గిరి ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.