తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కృష్ణా నదిలో గల్లంతైన మహిళ మృతదేహం లభ్యం - latest crime news in jogulamba gadwala district

గురువారం కృష్ణా నదిలో గల్లంతైన మహిళ మృతదేహం లభ్యమైంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నది అగ్రహరం వద్ద కృష్ణా నదిలో రవళి అనే మహిళ మునిగిపోయింది.

lady deadbody found in krishna river in jogulamba gadwala district
కృష్ణా నదిలో గల్లంతైన మహిళ మృతదేహం లభ్యం

By

Published : Sep 4, 2020, 2:41 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గురువారం ఎక్సైజ్ కానిస్టేబుల్ జగదీశ్​, అతని భార్య రవళితో సహా 14 మంది పిండ ప్రధానం చేసేందుకు కృష్టా నది తీరానికి చేరుకున్నారు. నదిలో రవళితోపాటు వారి పిల్లలు స్నానానికి దిగారు. ఈ క్రమంలో రవళి కాలుజారి నదిలో కొట్టుకుపోయింది.

పోలీసులు నిన్నటి నుంచి గజ ఈతగాళ్లు సహాయంతో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు రవళి మృతదేహం గల్లంతైన ప్రదేశం నుంచి కొంత దూరంలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇవీచూడండి:దారుణం: ఆడపిల్లలు పుట్టారని పురుగులమందు తాగించిన తండ్రి

ABOUT THE AUTHOR

...view details