తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య - sangareddy district latest news

అదనపు కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా ఐలాపూర్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

lady commited suicide due to the husband doury harassment in sangareddy district
వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

By

Published : Aug 7, 2020, 9:37 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మండలం ఐలాపూర్​కు చెందిన స్వాతిని పటాన్​చెరు శివారు బండ్లగూడకు చెందిన శివశంకర్​కు ఇచ్చి ఈ ఏడాది మార్చిలో వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కొంత కట్నం తీసుకున్నారు. కొంతకాలం బాగానే ఉన్న భర్త శివశంకర్ అదనపు కట్నం కావాలంటూ తల్లి భారతమ్మతో కలిసి భార్య స్వాతిని వేధింపులకు గురి చేశాడు.

గత కొంత కాలంగా భర్త, అత్త వేధింపులు భరించలేని స్వాతి.. తల్లిగారి ఇంటివద్ద శుక్రవారం ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్వాతి ప్రస్తుతం గర్భవతిగా ఉంది. అమీన్​పూర్ పోలీసులు భర్త శివశంకర్ అత్త భారతమ్మపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:కేంద్రం 'దిగుమతి' నిర్ణయం.. మొక్కజొన్న రైతులకు శరాఘాతం

ABOUT THE AUTHOR

...view details