హైదరాబాద్ బేగంపేట మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు కర్నూల్ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన మంజునాథ్(23)గా పోలీసులు గుర్తించారు.
ఈ నెల 26 వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో మెట్రో స్టేషన్‌పై నుంచి దూకినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా పోలీసులు గుర్తించారు. గాయపడిన మంజునాథ్‌ను ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.