నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండలం కాస్లాబాద్‌లో అనుమానం పెనుభూతమై ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. వెయ్యి రూపాయలు దొంగలించాడనే అనుమానంతో ఆంజనేయులు అనే వ్యక్తి అతని స్నేహితుడు రాజును హత్య చేశాడు.
వెయ్యి రూపాయల కోసం స్నేహితుడినే చంపేశాడు - Killed a friend for a thousand rupees
నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండలం కాస్లాబాద్‌లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి అనుమానంతో స్నేహితుడినే చంపేశాడు. వెయ్యి రూపాయలు దొంగలించాడనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి నిందితుడు కాల్వల్లో పడేశాడు.
కొన్ని రోజుల క్రితం ఇద్దరు కూర్చుని మద్యం సేవించారు. అదే సమయంలో వెయ్యి రూపాయలు కనపడకపోవడం వల్ల ఆంజనేయులుకు రాజుపై అనుమానం వచ్చింది. మద్యం తాగేందుకు మరోసారి రాజును ఇంటికి పిలిచిన ఆంజనేయులు.. తాగిన తర్వాత రాజు తలపై రాడ్‌తో కొట్టి హత్య చేశాడు. శవాన్ని గొడ్డలితో ముక్కలుగా చేసి వేర్వేరు చోట్ల కాల్వలో పడేశాడు. ఈ హత్యపై విచారణ ప్రారంభించిన పోలీసులు.. 48 గంటల్లో కేసును చేధించి... ఆంజనేయులను అరెస్టు చేశారు.
ఇదీ చూడండి :'తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యమే అగ్నిప్రమాదానికి కారణం'