కిడ్నాపర్ రవిశేఖర్ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. 2001 నుంచి నేరాలకు పాల్పడుతున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన రవిశేఖర్... రవి అలియాస్ శ్రీధర్ రెడ్డి అలియాస్ రవీందర్ బాబు అలియాస్ అశోక్ బాబు అనే పేర్లతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
చక్కెర పరిశ్రమలో ఉద్యోగం ఇప్పిస్తానని 2001లో మొదటిసారిగా బంధువు నుంచి 30వేలు తీసుకొని జైలు శిక్ష అనుభవించాడు. ఎక్కువగా ప్రభుత్వ అధికారిగా చెప్పుకొంటూ డబ్బు కోసం మోసాలకు పాల్పడినట్లు సీపీ వెల్లడించారు. రేషన్ డీలర్స్, బియ్యం మిల్లుల యజమానులు, ఎరువుల దుకాణాలు, కిరణా దుకాణాలకు వెళ్లి విజిలెన్స్ అధికారినంటూ రవిశేఖర్ మోసాలు చేశాడు.