సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్‌ను మరోసారి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు చేయడంపై ఇటీవల కత్తి మహేశ్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలలోనూ ఇలానే సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన వ్యాఖ్యలపై... జాంబాగ్‌కు చెందిన ఉమేశ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మహేశ్‌ను మరోమారు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ అరెస్టు...
సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్‌ను మరోసారి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా అనుచిత వ్యాఖ్యలు, పోస్టులకు సంబంధించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు.
సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ అరెస్టు...
ఇప్పటికే ఆయన అనుచిత వ్యాఖ్యల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసులో పిటీ వారెంట్‌పై చెంచల్ గూడ జైల్ నుంచి మహేశ్‌ను నాంపల్లిలోని క్రిమినల్ న్యాయస్థానానికి పోలీసులు తీసుకెళ్లారు.