తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రూ.137 కోట్లు తీసుకుని.. రుణం ఎగవేత - కేఎస్​సీపీఎల్ ఎండీ కె.జగన్మోహన్ రావు

హైదరాబాద్​కు చెందిన కాసుకుర్తి సుజాత కన్​స్ట్రక్షన్స్​పై సీబీఐ కేసు నమోదు చేసింది. అలహాబాద్ బ్యాంకు నుంచి రూ. 137 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారన్న అభియోగంపై దాఖలు చేశారు. కంపెనీ డైరెక్టర్లను సీబీఐ అదుపులోకి తీసుకుంది.

Kasukurthi Sujatha Constructions 137 crore Debt evasion from allahabad bank
137 కోట్లు తీసుకుని.. రుణం ఎగవేత

By

Published : Dec 9, 2020, 4:24 AM IST

అలహాబాద్ బ్యాంకు నుంచి 137 కోట్ల రూపాయల రుణం తీసుకుని మోసం చేశారన్న అభియోగంపై హైదరాబాద్​లోని కాసుకుర్తి సుజాత కన్​స్ట్రక్షన్స్​పై సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు నివేదికలు, ఫోర్జరీ పత్రాలు సమర్పించి 137 కోట్ల రూపాయల రుణం తీసుకుని.. ఇతర అవసరాల కోసం మల్లించి... ఆ తర్వాత రుణం ఎగ వేసినట్లు బ్యాంకు విచారణలో తేలింది.

అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంకులో విలీనం కావడంతో... ఇండియన్ బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేఎస్​సీపీఎల్ ఎండీ కె.జగన్మోహన్ రావు, కంపెనీ డైరెక్టర్లు సుజాత, రాజేష్, రాధిక, మౌనికపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఇదీ చూడండి :మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు... ఫిర్యాదు చేసిన మహిళ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details