కరీంనగర్ జిల్లా ఊటూరు ఎస్‌బీఐలో దొంగతనానికి యత్నించిన అయిదుగురిని పోలీసులు పట్టుకున్నారు. బ్యాంకులో నగదు, సొత్తు అపహరణకు గురికాకపోయినా... ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. సీపీ కమలాసన్ రెడ్డి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 48 గంటల్లో నిందుతులను పట్టుకున్నారు.
48 గంటల్లో బ్యాంకు దోపిడీయత్నం కేసు ఛేదన - కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి వార్తలు
ఎస్‌బీఐలో దొంగతనం చేసేందుకు వచ్చి.. నానా ప్రయత్నాలు చేసి.. చివరకు నిరాశతో వెనుదిరిగిన దుండగులను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 48 గంటల్లో నిందితులను పట్టుకున్నారు.
పెద్దపల్లి జిల్లా పేరపల్లికి చెందిన తండ్రి కొడుకులు దూలం సంపత్, దూలం రాజుతో పాటు రేగడి మద్దికుంటకు చెందిన బాలసాని అజయ్, రొంపికుంటకు చెందిన మాడిశెట్టి రాకేశ్, జనగామ జిల్లా అప్పిరెడ్డిపల్లికి చెందిన వెన్నపూసల రాకేష్‌రెడ్డి హైదరాబాద్‌లో ఒకే చోట అద్దెకు ఉంటున్నారు. కరోనా నేపథ్యంలో పనులు లభించకపోవడంవల్లనే వారు దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. వీరి నుంచి ఒక తల్వార్‌తో పాటు రెండు ద్విచక్రవాహనాలు, ఇనుప చువ్వలున్న బ్యాగు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. ఈ ఘటనతో బ్యాంకులో తలుపులకు అలారం లేకపోవడం, వాచ్‌మెన్ లేని విషయాన్ని గుర్తించామని... ఈ విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని సీపీ తెలిపారు.
ఇదీ చూడండి:బ్యాంకు కొల్లగొట్టేందుకు విఫలయత్నం.. సీసీలో దృశ్యాలు