కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రంలోని పలు దుకాణాల్లో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
రూ. లక్షకు పైగా విలువ చేసే గుట్కా స్వాధీనం - గుట్కా ప్యాకెట్లు స్వాధీనం వార్తలు
బిచ్కుంద మండలంలోని పలు దుకాణాల్లో కామారెడ్డి జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా సంచులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
బిచ్కుంద మండలం, గుట్కా స్వాధీనం
స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ రూ. 1,10,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతరం ఆయా దుకాణాల వ్యాపారులపై కేసు నమోదు చేశారు.