తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అనిశా వలలో డీఎస్పీ.. 2 కోట్లకుపైగా అక్రమాస్తులు

తీగలాగితే డొంక కదిలిందన్నట్లుగా కేసు విచారణలో భాగంగా అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. క్రికెట్‌ బెట్టింగ్‌కు సంబంధించి నిందితుల నుంచి లంచం డిమాండ్‌ చేసిన కేసులో సోదాలు జరపగా... కామారెడ్డి డీఎస్పీ లక్ష్మి నారాయణ అక్రమాస్తులు బయటపడ్డాయి. సుమారు 2 కోట్ల 12 లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.... లక్ష్మి నారాయణను అరెస్ట్‌ చేశారు.

By

Published : Dec 7, 2020, 4:04 AM IST

Updated : Dec 7, 2020, 7:48 AM IST

kamareddy DSP arrest in acb raids in Hyderabad
అనిశాకు దొరికిన డీఎస్పీ.. 2 కోట్లుకుపైగా అక్రమాస్తులు

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మినారాయణ పెద్ద ఎత్తున ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు అనిశా దాడుల్లో తేలింది. అయితే ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు అనూహ్యంగా బయటపడింది. క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో ఐదుగురు నిందితులకు బెయిలు ఇచ్చేందుకు కామారెడ్డి ఇన్‌స్పెక్టర్‌ జగదీష్‌... నిందితుల నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్‌ చేశాడు. నిందితులు ముందుగా లక్షాయాభై వేల రూపాయలు నగదు ఇస్తుండగా... అనిశా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన నివాసంలో తనిఖీలు చేయగా 34 లక్షల రూపాయల నగదు, బంగారం, వెండి బయటపడింది.

ఆయన, బంధువుల నివాసాల్లో

ఈ కేసులో కామారెడ్డి సీఐ, ఎస్‌ఐ, మధ్యవర్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వద్ద లభించిన మరికొంత నగదు గురించి అధికారులు విచారించగా... ఆ నగదు డీఎస్పీ లక్ష్మినారాయణకు చెందినదని సీఐ తెలిపాడు. దీంతో ఏసీబీ బృందం అనుమానంతో హైదరాబాద్‌లోని తిరుమలగిరి, నిజామాబాద్‌, నల్గొండ కామారెడ్డి రంగారెడ్డి జిల్లాల్లో ఆయన, బంధువుల నివాసాల్లో సోదాలు నిర్వహించింది.

రెండు కోట్ల పన్నెండు లక్షలు

సోదాల్లో ఆయా జిల్లాల్లోని 17 వ్యవసాయ భూములు, 5 ఇళ్ల ఖాళీ స్థలాలు, తిరుమలగిరి, సరూర్‌నగర్‌, మిర్యాలగూడ ప్రాంతాల్లో భవనాలతోపాటు బంగారం, నగదు లభించింది. వాటి విలువ సుమారు రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు డీఎస్పీ లక్ష్మినారాయణను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చూడండి :రాష్ట్రంలో తొలివిడతలో 70-75లక్షల మందికి టీకా

Last Updated : Dec 7, 2020, 7:48 AM IST

ABOUT THE AUTHOR

...view details