కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్, వాజిద్‌నగర్, హస్గుల్, ఖద్గాం గ్రామాల పరిధిలో... మంజీరా నదిలో ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్, మహారాష్ట్ర, కర్ణాటకలకు ఇసుకను తరలిస్తున్నారు. అభివృద్ధి పనులతోపాటు పట్టణ ప్రాంతాల్లో భవనాల నిర్మాణం కోసం... వందల లారీల్లో ఇసుక రవాణ జరుగుతోంది. గతేడాది బిచ్కుంద నుంచి రీచ్‌లు ఉండే కుర్లాం వరకు రోడ్డు నిర్మించారు. మంజీరా నది నుంచి రోడ్డు వరకు... బిచ్కుంద మీదుగా లారీల రాకపోకలు సాగిస్తున్నారు. అతివేగం, పరిమితికి మించి సామర్థ్యంతో లారీలు నడపడంతో రోడ్లు పాడవడమే కాకుండా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది.
తీవ్రగాయాలతో..
ఈనెల 28న ఇసుక లారీ ఓ యువకుడ్ని ఢీకొట్టింది. బాధితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇసుక రవాణే ప్రమాదానికి కారణమని భావించిన గ్రామస్థులు... ఆగ్రహంతో లారీకి నిప్పు పెట్టి.... కొన్నింటిని ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన పోలీసులపైనా దాడి చేశారు. బిచ్కుంద మీదుగా లారీలు వెళ్లకుండా అడ్డుకుంటామని స్థానికులు చెబుతున్నారు.