కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడిన లోకో పైలట్ చంద్రశేఖర్ మృతిచెందాడు. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 11న హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్ ఢీ కొట్టింది. లోకోపైలట్ సహా 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్‌కు చికిత్స అందిస్తూ కుడికాలికి రక్త ప్రసరణ నిలిచిపోవడం వల్ల రెండు రోజుల క్రితం తొలగించారు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచారు.
కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడిన లోకో పైలట్ మృతి - లోకో పైలట్ మృతి
loco pilot
22:04 November 16
కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడిన లోకో పైలట్ మృతి
Last Updated : Nov 16, 2019, 11:02 PM IST