తెలంగాణ

telangana

By

Published : Jan 2, 2021, 5:30 PM IST

ETV Bharat / jagte-raho

12 గంటల్లోపే దొంగ అరెస్ట్​... చోరీ సొత్తు సేఫ్​: సీపీ

హైదరాబాద్​ బర్కత్​పురాలో జరిగిన చోరీ కేసులో నిందితున్ని పోలీసులు 12 గంటల్లోపే పట్టుకున్నారు. పని చేస్తున్న ఇంట్లోనే దొంగతనం చేసిన దుండగున్ని అదుపులోకి తీసుకుని... చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ దృశ్యాల ఆధారంగా దొంగను పట్టుకున్నట్లు తెలిపారు.

kachiguda police arrested theft in barkatpura case in 12 hours
kachiguda police arrested theft in barkatpura case in 12 hours

12 గంటల్లోపే దొంగ అరెస్ట్​... చోరి అయిన సొత్తు సేఫ్​

యజమాని ఇంట్లో చోరికి పాల్పడిన వ్యక్తిని కాచిగూడ పోలీసులు 12 గంటల్లోపు అరెస్ట్ చేశారు. నిందితుడు చోరీ చేసిన రూ.35 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతో పాటు లక్షా 20 వేల నగదును కాచిగూడ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా యేలేశ్వరం మండలం రామయ్యపేటకు చెందిన నంద కూసరాజు ఏడేళ్ల పాటు ఊర్లోనే భవన నిర్మాణ కూలీగా పనిచేశాడు. బతుకుదెరువు కోసం 4 ఏళ్ల క్రితం హైదరాబాద్​కు వచ్చి దినసరి కూలీగా పనిచేశాడు.

రెండేళ్ల క్రితం మియాపూర్​లోని ఓ ఏజెన్సీ ద్వారా బర్కత్​పురాలో ఇంట్లో పనిమనిషిగా కుదిరాడు. పక్షవాతంతో బాధపడే ఇంటి యజమాని విజయ్ సీతారాంకు సపర్యలు చేసేవాడు. ఈ క్రమంలో ఇంటి యజమాని వద్ద ఉన్న తాళం చెవిని తీసుకొని నకిలీ తాళం చెవి చేయించాడు. డిసెంబర్​ 31న ఇంటి యజమాని అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. విజయ్, ఆయన భార్య ఆస్పత్రిలో ఉండగా... అదును చూసి నకిలీ తాళం చెవితో ఇంట్లోకి వెళ్లాడు. పడక గదిలో ఉన్న 65తులాల బంగారం, 55తులాల వెండి, లక్షా 20వేల నగదు చోరీ చేశాడు.

ఆస్పత్రి నుంచి రాత్రి ఇంటికి వచ్చి... చోరి జరిగిన విషయాన్ని గుర్తించిన యజమాని భార్య కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు... సీసీ కెమెరాల ఆధారంగా నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: కేసీఆర్ ఫోన్: నాగిరెడ్డి పంటెట్టున్నది... విత్తనాలు ఎక్కడ తెచ్చినవ్!

ABOUT THE AUTHOR

...view details