ఔషధ దుకాణం అనుమతి కోసం లంచం తీసుకుంటూ కరీంనగర్‌లోని డ్రగ్ కంట్రోల్ కార్యాలయంలో పనిచేసే ఓ జూనియర్ అసిస్టెంట్, అటెండర్ అనిశా అధికారులకు దొరికిపోయారు. హుజురాబాద్‌కు చెందిన రవీందర్ అనే వ్యక్తి మెడికల్ దుకాణం ఏర్పాటు చేసేందుకు అనుమతి కోసం కొన్ని రోజుల కిందట కరీంనగర్‌లోని కార్యాలయానికి వచ్చారు. అనుమతి ఇవ్వాలంటే ఇరవై వేలు లంచం ఇవ్వాల్సిందేనని జూనియర్ అసిస్టెంట్ వినాయక రెడ్డి పట్టుబట్టటం వల్ల బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
లంచం తీసుకుంటూ అనిశాకు దొరికిన జూనియర్ అసిస్టెంట్ - karimnagar news
మెడికల్ దుకాణం అనుమతిని లంచం తీసుకుంటూ... ఓ జూనియర్ అసిస్టెంట్‌తో పాటు అటెండర్ అనిశా అధికారులకు దొరికిపోయారు. లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
junior assistant arrested for taking bribe
అధికారుల ప్రణాళిక ప్రకారం బాధితుడు జూనియర్ అసిస్టెంట్‌ని కలిసి డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చాడు. కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా... రూ. 500 ఇవ్వాలని డిమాండ్ చేయటం వల్ల అతనికి సైతం డబ్బు ఇచ్చాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. డబ్బులు దొరకటం వల్ల నిందితులను అరెస్టు చేసి అధికారులు కేసు నమోదు చేశారు.