తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆ నెపంతో 150 మందిని బురిడీ కొట్టించాడు - ఆ నేపంతో 150 మందిని బురిడీ కొట్టించాడు

ఉద్యోగాల పేరుతో 150 మందిని బురిడీ కొట్టించిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కూపీ లాగారు. ఉద్యోగాల పేరుతో పాత నేరస్థుడైన కిలపర్తి సందర్శ్ పలువురి నుంచి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు.

job-racket-busted-in-visakhapatnam
ఆ నెపంతో 150 మందిని బురిడీ కొట్టించాడు

By

Published : Nov 23, 2020, 10:58 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో ఉద్యోగాల పేరుతో 150 మందికి కుచ్చుటోపీ పెట్టిన ఘటన వెలుగు చూసింది. సాన్ నెక్స్ జనరేషన్ పేరుతో నకిలీ సంస్థను స్థాపించి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడైంది. ఇందులో ప్రధాన సూత్రదారుడిగా పాత నేరస్థుడైన కిలపర్తి సందర్శ్​ను గుర్తించారు. ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్పి వసూళ్లు చేసినట్లు విచారణలో బయటపడింది.

బాధితుల ఫిర్యాదుతో నాలుగో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టగా... కిలపర్తి సందర్శ్‌పై గతంలో అనేక కేసులు ఉన్నట్లు తేటతెల్లమైంది. నౌకాదళ ఉద్యోగాల పేరుతో మోసం చేసి గతంలోనూ సందర్శ్ జైలుకెళ్లాడు. జైలు నుంచి బయటకు వచ్చి మరికొందరిని సందర్శ్ మోసం చేసినట్లు తెలిసింది.

ఇదీ చదవండి :మమ్మల్ని రక్షించండి!

ABOUT THE AUTHOR

...view details