తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఉత్తుత్తి ఉద్యోగాల్లో చేరి మోసపోయారు - hospital

ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. ఒప్పంద పద్ధతిలో జీతం వస్తదన్నాడు. ఒక్కొక్కరి వద్ద 20 నుంచి 50 వేలు వసూలు చేశాడు. తుదకు మోసపోయామని తెలుసుకున్న బాధితులు  కన్నీరుమున్నీరైన ఘటన నిజామాబాద్​లో చోటుచేసుకుంది.

నిజామాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రి

By

Published : Mar 19, 2019, 8:45 PM IST

Updated : Mar 19, 2019, 10:21 PM IST

ఉత్తుత్తి ఉద్యోగాల్లో చేరి మోసపోయారు
ఉద్యోగం పేరిట మోసాలు జరుగుతున్నా కొంత మంది మేలుకోవడం లేదు. తాజాగా నిజామాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రిలో కొలువులు ఇప్పిస్తానని సతీశ్​ అనే వ్యక్తి పది మంది వద్ద... డబ్బు తీసుకున్నాడు. ఒక్కొక్కరి వద్ద 20 నుంచి 50 వేలు వసూలు చేశాడు. ఒప్పంద పద్ధతిలో మూడు నెలలకు ఒకసారి జీతం ఇస్తారని చెప్పి వారిని తీసుకెళ్లి దవాఖానాలో విధుల్లో చేర్పించాడు. నిజంగానే ఉద్యోగం వచ్చిందని నమ్మిన వారంతా ఆస్పత్రిలో పనులు చేసుకుంటున్నారు.


నిజం ఇలాబయటపడింది...
ఇంతలో ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు వార్డుల్లో పర్యవేక్షణకు వెళ్లారు. అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న పది మందిని చూసి ప్రశ్నించారు. తాము కొత్తగా ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదని స్పష్టం చేయడంతో వారంతా లదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Last Updated : Mar 19, 2019, 10:21 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details