హైదరాబాద్ జియాగూడకు చెందిన 16 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన... భాజపా ఎస్సీ మోర్చా నాయకుడు బిడ్ల సతీష్ తనయుడు రోహణ్పై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కులసుంపురా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రేపిస్టుపై చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీలో ఫిర్యాదు - నిందితుడిపై చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీలో ఫిర్యాదు
మైనర్పై అత్యాచారం చేసిన యువకుడిపై ఫిర్యాదు చేసినా... పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలి కుటుంబసభ్యులు రాష్ట్ర మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
రేపిస్టుపై చర్యులు తీసుకోవాలని హెచ్చార్సీలో ఫిర్యాదు
జియగూడా సంజీవనగర్లో ఈ నెల 8న బాలిక తల్లిదండ్రులు కూలీ పనికి పోయారు. ఆ సమయంలో... బాలిక ఒంటరిగా ఉండటం చూసి ఇంటి వెనుక నుంచి వచ్చి బలవంతంగా అత్యాచారం చేసినట్టు వివరించారు. ఎవరికైనా చెప్తే నగ్నంగా ఉన్న ఫోటోలు బయటపెడతామని బెదిరించినట్టు తెలిపారు. అందుకే తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేదని... కడుపు నొప్పి తీవ్రం కావడం వల్ల ఆసుపత్రికి తీసుకెళ్తే అసలు విషయం బయటపడినట్టు చెప్పారు.