తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మహిళలకు కుచ్చుటోపి పెట్టిన ఝార్ఖండ్​​ కేటుగాళ్లు అరెస్ట్

రోజురోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మహిళలకు ఫోన్​ చేసి.. మాయమాటలతో ఝార్ఖండ్ కేటుగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు వారిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

Hyderabad Cyber ​​Crime Latest News
Hyderabad Cyber ​​Crime Latest News

By

Published : Nov 24, 2020, 12:17 AM IST

ఝార్ఖండ్​కు చెందిన ఇద్దరు సైబర్​ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్​క్రైమ్​ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2 చరవాణిలు, 3 డెబిట్​ కార్డులు, పాన్​కార్డు, 3 బ్యాంకు పాస్​ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.

ఝార్ఖండ్​లోని దన్​బాద్​కు చెందిన మనోజ్​ మండల్, కలాం ఖాన్​ కలిసి హైదరాబాద్​కు చెందిన మహిళలకు ఫోన్​ చేసి... మాయమాటలు చెప్పి ఖాతా వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఖాతా నుంచి ఐదు లక్షల రుణం తీసుకుని ఇతర బ్యాంకు ఖాతాలకు మళ్లీంచారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్​ క్రైమ్ పోలీసుల బృందం అక్కడికి వెళ్లారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ట్రాన్సిట్​ వారెంట్​పై హైదరాబాద్​ తీసుకొచ్చి... న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి ఎస్​ఈసీ లేఖ.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details